మహేష్, సుకుమార్ మైండ్ బ్లోయింగ్ బడ్జెట్..!

-

ప్రస్తుతం మహేష్ 25వ సినిమా మహర్షి వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్ తో సినిమా లైన్ లో పెట్టాడు మహేష్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్నది బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్, సుకుమార్ సినిమాకు దాదాపు 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. బాహుబలి సినిమాతో ఎంత బడ్జెట్ సినిమా అయినా సరే కరెక్ట్ గా ప్రమోట్ చేస్తే అంతకంత రాబట్టొచ్చని ప్రూవ్ అయ్యింది.

ఆ క్రమంలోనే ప్రభాస్ సాహో, చిరంజీవి సైరా 150 కోట్ల పైనే బడ్జెట్ పెట్టేస్తున్నారు. మహేష్ స్టామినాకు 150 కోట్లు పర్ఫెక్ట్. అయితే వన్ నేనొక్కడినే లాంటి డిజాస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్ కు అంత బడ్జెట్ కేటాయించడం కాస్త షాకింగ్ గానే ఉంది. మహేష్ శ్రీమంతుడు సినిమాతోనే నిర్మాతలుగా మారిన మైత్రి మూవీ మేకర్స్. మరోసారి మహేష్ కు ఆ హిట్ రిపీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

150 కోట్ల బడ్జెట్ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా సినిమా మొత్తం హై క్వాలిటీతో వస్తుందట. అంతేకాదు సినిమా కోసం ప్రముఖ టెక్నిషియన్స్ కూడా పనిచేస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news