యాదగిరిగుట్టకు చేరుకున్న బండి సంజయ్

-

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటినుంచి సాగనుంది. ఉదయం ఖైరతాబాద్ అమ్మవారి టెంపుల్ లో పూజలు చేసిన బండి సంజయ్ పార్టీ కార్యాలయం నుంచి యాదాద్రి కి చేరుకున్నారు. ఘట్కేసర్ లో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు బండి సంజయ్ స్వాగతం పలికారు. ఘట్కేసర్ లోని పార్టీ ఆఫీసులో కేంద్రమంత్రిని బండి సంజయ్ సన్మానించారు. ఈ మూడో విడత యాత్రకు బిజెపి శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యాదాద్రి ఆలయంలో పూజలు చేశారు బండి సంజయ్. నేడు పది కిలోమీటర్లు నడవనున్నారు బండి సంజయ్. రాత్రికి బస్వాపూర్ లో బస చేస్తారు. ఈ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 24 రోజులపాటు కొనసాగనుంది.328 కిలోమీటర్లు నడవనున్నారు బండి సంజయ్. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో సంజయ్ పాదయాత్ర చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news