మాధవ్‌ వీడియో నిజమని తేలితే.. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటాం : సజ్జల

-

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ వీడియోను ఆసరాగా చేసుకోని అధికార వైసీపీ పార్టీపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ క్రమంలో.. అయితే, ఇది కుట్ర అని, వీడియో మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ అంటున్నారు. తాను జిమ్ లో ఉన్నప్పటి వీడియోను మార్ఫింగ్ చేసి, తాను ఓ మహిళతో మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు మాధవ్‌. కాగా, ఈ వీడియో టీడీపీ వర్గాలకు బలమైన ఆయుధంలా లభించింది. ఈ ఉదయం నుంచి టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ఇది ప్రైవేటు వ్యవహారానికి చెందిన వీడియో అని, వైరల్ అయిందని అన్నారు సజ్జల. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి (గోరంట్ల మాధవ్) తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరిస్తున్నాడని అన్నారు సజ్జల.

Sajjala Ramakrishna Reddy rules out early elections in Andhra Pradesh

ఈ వీడియో మార్ఫింగ్ చేసినదని గోరంట్ల మాధవ్ చెబుతున్నాడని, ఒకవేళ అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే మాత్రం అతడిపై కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు సజ్జల. ఓ రాజకీయ పార్టీ ఎంతమేరకు చర్య తీసుకోగలదో ఆ స్థాయిలో చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఆ చర్యలు అందరికీ గుణపాఠంలా ఉంటాయని అన్నారు సజ్జల. అది ఫేక్ వీడియో అని మాధవ్ సవాల్ చేసి చెబుతున్నాడని, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడని పేర్కొన్నారు సజ్జల. విచారణ అనంతరం వెలువడే అసలు నిజం కోసం వేచిచూస్తున్నామని వెల్లడించారు సజ్జల. ఏదేమైనా ఇది ప్రైవేటు వ్యవహారం కాబట్టి తక్కువగా మాట్లాడాల్సి ఉంటుందని, జగన్ చేతల్లోనే చూపిస్తారని వివరించారు సజ్జల.

 

Read more RELATED
Recommended to you

Latest news