సినిమా ఇండస్ట్రీలో అగ్రతారలుగా 1980, 90ల్లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఉన్నారు. ఆ సమయంలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ మేక నటించిన ఒక చిత్రం చిన్న సినిమాగా వచ్చి ఆనాటి అగ్ర తారల రికార్డులను బద్దలు కొట్టింది. ఇండస్ట్రీ మొత్తం అసలు ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఆశ్చర్యంగా ఉందని అంటూనే, స్వాగతం పలికింది. ఆ సినిమా మరేదో కాదండోయ్..దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’.
ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్ అదే టైటిల్ ‘పెళ్లి సందD’ పేరుతో రాగా అందులో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. ఇక శ్రీకాంత్ ‘పెళ్లి సందడి’ చిత్ర విషయానికొస్తే..ఆ సినిమా అప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిల రికార్డులను ఈ పిక్చర్ బద్దలు కొట్టేసింది.
దాదాపు రూ.80 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ను మేకర్స్ తెరకెక్కించారు. ఇక ఇందులో హీరోగా శ్రీకాంత్ మేకను తీసుకున్నారు. అప్పటికే ‘తాజ్ మహల్’ సినిమాతో శ్రీకాంత్ కు గుర్తింపు వచ్చింది. ఫ్యామిలీ హీరోగా అప్పుడే మంచి ఫామ్ లో ఉన్న శ్రీకాంత్..ఈ సినిమాతో కుటుంబాలకు చాలా దగ్గరైపోయారు. ఎం.ఎం.కీరవాణి అందించిన మ్యూజిక్ , పాటలు జనాలను ఇప్పటికీ ఎంటర్ టైన్ చేస్తున్నాయి.
సీనియర్ ఎన్టీఆర్ ‘లవకుశ’ పిక్చర్ 27 కేంద్రాల్లో వంద రోజులు ఆడగా, ‘పెళ్లి సందడి’ మూవీ 33 కేంద్రాల్లో వంద రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. అప్పటికి ఎక్కువ షోలు ఆడిన ఫిల్మ్ గా మెగాస్టార్ చిరంజీవి రికార్డు క్రియేట్ చేయగా, దానిని ‘పెళ్లి సందడి’ పిక్చర్ బ్రేక్ చేసింది. అలా ఈ పిక్చర్ పలు రికార్డులు క్రియేట్ చేసింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ పిక్చర్ లో పాటలను తెరకెక్కించిన తీరును ఇప్పటికీ సినీ ప్రియులు మెచ్చుకుంటారు. ఈ చిత్రంలో కథానాయికలుగా రవళి, దీప్తి భట్నాగర్ నటించారు.