కేంద్ర రైల్వేశాఖ ప్రయాణికులకు ముఖ్య గమనిక తెలియజేసింది. భారతదేశాన్ని అన్ని రంగాల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను నిర్మిస్తోంది. ప్రస్తుతం రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికులకు సులభతరం చేసింది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ-టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తత్కాల్, చైల్డ్ టికెట్లు, వికలాంగుల టికెట్లు, సీనియర్ సిటిజన్లకు రాయితీ ధరలతో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. రెండు స్టేషన్ల మధ్య ప్రయాణం కోసం కూడా ఈ-టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కస్టమర్‌కు పీఎన్ఆర్, బుకింగ్ వివరాలు ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపనున్నారు. ఒక వ్యక్తి ఒక నెలలో గరిష్టంగా 6 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధార్ లింక్ చేసుకున్న వ్యక్తి నెలలో గరిష్టంగా 12 టికెట్లు కల్పించనుంది.