ఎడిట్ నోట్: ‘ఎర్ర’ ’గులాబీ’..!

-

దేశంలో కమ్యూనిస్టులు కంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది…పేదల కోసం పోరాడే పార్టీగా ముద్ర ఉంది..అలాగే ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవారు. కానీ రాను రాను వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది…ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ప్రభావం బాగా తగ్గింది. 2014లో తెలంగాణలో కమ్యూనిస్టులు రెండు, మూడు సీట్లు గెల్చుకున్నారు గాని…2018 ఎన్నికల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు…కాంగ్రెస్-టీడీపీలతో కలిసి పొత్తు పెట్టుకుని వారి ఫెయిల్ అయ్యారు.

అక్కడ నుంచి తెలంగాణలో కమ్యూనిస్టుల హవా తగ్గిపోయింది…ఏదో మొక్కుబడిగా ఆ పార్టీలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే పార్టీల ప్రభావం తగ్గిన సరే…ఆ పార్టీలని అభిమానించే వారు ఇంకా ఉన్నారు. అందుకే ఇప్పటికీ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు…కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాయి. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రెండు పార్టీలకు కమ్యూనిస్టుల అవసరం బాగా వచ్చింది. ఎందుకంటే మునుగోడు సి‌పి‌ఐ పార్టీ కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్ ఆరు సార్లు గెలిస్తే..సి‌పి‌ఐ అయిదుసార్లు గెలిచింది.

అంటే మునుగోడులో సి‌పి‌ఐ పార్టీకి ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని సార్లు టీడీపీతో పొత్తుతో సి‌పి‌ఐ గెలిచింది. 2009 ఎన్నికల్లో టీడీపీ-టీఆర్ఎస్ మద్ధతుతో మునుగోడులో సి‌పి‌ఐ గెలిచింది. అయితే తర్వాత కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేయడంతో ఓడిపోతూ వస్తుంది. అలా అని మునుగోడులో ఆ పార్టీకి బలం లేదని అనుకోవడానికి లేదు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం బాగానే ఉంది.

అందుకే అన్నీ పార్టీలు కమ్యూనిస్టులు వైపు చూస్తున్నాయి. ఇప్పటికే టి‌పి‌సి‌సి రేవంత్ రెడ్డి…కమ్యూనిస్టు సోదరుడు మద్ధతు ఇవ్వాలని కోరారు. అటు బద్దశత్రువైన బీజేపీ సైతం..కమ్యూనిస్టు నేతలు అమ్ముడు పోయేవాళ్లు గాని, కార్యకర్తలు మంచి వాళ్ళు అని, వారి మద్ధతు పొందేలా మాట్లాడారు. ఇటు అధికార టీఆర్ఎస్ ఎలాగో సి‌పి‌ఐ మద్ధతు కోసం గట్టిగానే ట్రై చేసింది. అయితే చివరికి టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు తెలిపేందుకు సి‌పి‌ఐ రెడీ అయింది.

తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చాలాసేపు చర్చలు జరిగిన తర్వాత…టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు సి‌పి‌ఐ ప్రకటించింది. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే మునుగోడు ఉప ఎన్నికలోనే కాకుండా భవిష్యత్తులోనూ కలిసి పని చేద్దామని సీపీఐ నేతలకు కేసీఆర్‌ ప్రతిపాదించారని తెలిసింది.

ఇక ఎర్ర పార్టీ…గులాబీ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో మునుగోడులో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి…కొద్దో గొప్పో బలం ఉన్న సి‌పి‌ఐ…టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తే…మునుగోడులో కాస్త అడ్వాంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఎవరు కలిసి పోటీ చేసిన తాము మాత్రం ఒంటరిగానే బరిలో దిగుతామని బీజేపీ అంటుంది…అలాగే వరుసపెట్టి టీఆర్ఎస్ సర్పంచ్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సిలని లాగేస్తూ బీజేపీ బలపడుతుంది. పైగా అమిత్ షా సభ తర్వాత మునుగోడులో బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళ్ళోచ్చు. మొత్తానికైతే మునుగోడు పోరు హోరాహోరీగా సాగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news