తెలంగాణలో జనసేన పోటీ…బీజేపీతో కలిసేనా?

-

తెలంగాణలో మునుగోడు పోరు హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే…టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది…అయితే మునుగోడులో పోటీ చేయమని కమ్యూనిస్టులు చెప్పేశారు. అలాగే టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అటు షర్మిల పార్టీ పోటీ చేసేలా లేదు. ఇక బీఎస్పీ పోటీ చేస్తానంటుంది గాని…ఇంకా అభ్యర్ధిని డిసైడ్ చేయలేదు. టీడీపీ కూడా పోటీకి దిగవచ్చని ప్రచారం జరుగుతుంది.

ఇక ఇక్కడ పోటీ చేయాలని జనసేన శ్రేణులు…పవన్ ముందు డిమాండ్ పెట్టినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ వెల్లడించారు..మునుగోడులో పోటీ చేద్దామని అక్కడ నాయకులు కోరారని, కానీ ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పాలని అడిగినట్లు చెప్పారు. వంద, వెయ్యి ఓట్లతో ప్రయోజనం లేదని, అందుకే పోటీ వద్దన్నానని చెప్పారు. మునుగోడులో తమ పార్టీ పోటీ చేయదని చెప్పేశారు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ బలంగా ఉన్న చోట్ల జనసేన అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు.

అంటే నెక్స్ట్ ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన పోటీ చేస్తుందని అంటున్నారు..అయితే బీజేపీతో పొత్తులో పోటీకి దిగుతారా? లేక సింగిల్ గా పోటీ చేస్తారా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మునుగోడులో బీజేపీకి మద్ధతు ఇస్తున్నట్లు కూడా ప్రకటించలేదు. బీజేపీతో పొత్తులో ఉండి కూడా…తెలంగాణలో బీజేపీకి మద్ధతు ఇచ్చే విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వడం లేదు. అటు తెలంగాణ బీజేపీ నేతలు సైతం…మద్ధతు కోసం పవన్ వెనుక పడటం లేదు.

సింగిల్ గానే సత్తా చాటుతామని అంటున్నారు…మరి నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఉండేలా లేదు. ఎవరికి వారే సింగిల్ గా పోటీ చేసేలా ఉన్నారు..ఇలా జరిగితే బీజేపీకే నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఏపీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాబట్టి…పవన్ మద్ధతు బీజేపీ తీసుకునేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news