అమ్మ ఒడి ఇచ్చానంటూ.. అమ్మ ఒడిలో బిడ్డల ప్రాణాలు తీయడం న్యాయమేనా?: నారా లోకేష్

-

విలీన మండలాలలో విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇటీవల సంధ్య అనే చిన్నారి తీవ్ర జ్వరంతో మృతి చెందింది. ఈ పాపం ప్రభుత్వానిదేనంటూ మండిపడ్డారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్. అమ్మ ఒడి ఇచ్చానంటూ.. అమ్మ ఒడిలో ప్రాణాలు తీయడం న్యాయమేనా? అని ప్రశ్నిస్తూ ట్విట్ చేశారు. ” మామల రక్షిస్తానన్న మాయ మాటలు చిన్నారి సంధ్య ప్రాణాలు తీసుకువస్తాయా జగన్ రెడ్డి గారూ! వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆ గ్రామ సమస్యలపై కనీస దృష్టి సారించినా చిన్నారి సంధ్య మన మధ్య ఉండేది.

అమ్మ ఒడి ఇచ్చానంటూ అమ్మ ఒడిలో బిడ్డల ప్రాణాలు తీయడం న్యాయమేనా?. విలీన మండలాల్లో విష జ్వరాలతో జనం విలవిల్లాడుతున్నారు. ఆస్పత్రిలో పరీక్షల కిట్లు, మందులు లేవు. చింతూరు ఏరియాలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందినా సర్కారులో చలనం లేదు. ముఖ్యమంత్రి గారు, మానవత్వం అనేది ఏ మూలాన ఉన్నా.. సంధ్య లాంటి మరో చిన్నారి బలి కాకుండా చర్యలు తీసుకోవాలి”. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news