మునుగోడు పోరు.. అభ్యర్ధులకు చుక్కలే..!

-

మునుగోడు ఉపఎన్నిక వల్ల మునుగోడు ప్రజలకు మంచే జరిగేలా ఉంది. ఇంతకాలం నియోజకవర్గంలో పెద్దగా పనులు జరగలేదు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండటం వల్ల..అధికార టీఆర్ఎస్ ఎక్కువ పనులు చేయించలేదు. అయితే అనూహ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని చెప్పి ఇటు టీఆర్ఎస్..అటు బీజేపీ గట్టిగా ట్రై చేస్తున్నాయి. అదే సమయంలో తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది.

అయితే ఉపఎన్నిక వల్ల మునుగోడు ప్రజలకు బాగా బెనిఫిట్ అవుతుంది…ఎప్పుడూలేని విధంగా నియోజకవర్గంలో అభివృధ్ది పనులు జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వం కొత్త కొత్త వరాలు ఇస్తుంది. పథకాలు వస్తున్నాయి. ఇక అభ్యర్ధులు ఎవరు ప్రచారానికి వెళితే..ఆ వూరులో విందు, వినోదమే అనే పరిస్తితి. అసలు మునుగోడులో ఏ రకంగా విందులు నడుస్తున్నాయంటే…నియోజకవర్గంలో నాటు కోళ్ళు, గొర్రెలు తక్కువైపోయాయట. అంటే ఏ స్థాయిలో విందు కార్యక్రమాలు నడుస్తున్నాయనే చెప్పొచ్చు. ఇంకా మద్యం గురించి చెప్పాల్సిన పని లేదు.

ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజీనామాకు ఆమోద ముద్ర పడిందో…అప్పటినుంచి నియోజకవర్గంలో మద్యం సేల్స్ అమాంతం పెరిగిపోయాయని తెలుస్తోంది. దీని బట్టి చూస్తే ఉపఎన్నిక ముగిసే లోపు అభ్యర్ధులకు ఏ స్థాయిలో ఖర్చు అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రతి ఖర్చు అభ్యర్ధులే పెట్టుకోవాలి. ఇక ఎన్నికల ముందు ఏ స్థాయిలో ఖచు అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అయితే మూడు పార్టీల అభ్యర్ధులు కాస్త సౌండ్ పార్టీలే..కాబట్టి మునుగోడులో భారీగా ఖర్చు అయ్యేలా ఉంది.

ఎంత డబ్బు ఉన్న వాళ్ళు అయినా సరే…వందల కోట్లు ఖర్చు పెట్టాలంటే చుక్కలు కనబడతాయి. ఎన్నికల్లో గెలవడం సంగతి పక్కన పెడితే..అభ్యర్ధులకు ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ఇక్కడ గెలిచిన అభ్యర్ధికైనా, ఓడిన అభ్యర్ధికైనా చుక్కలు కనిపించడం ఖాయమే. మరి ఎన్నికల ముగిసే నాటికి ఒక్కో అభ్యర్ధికి ఎంత వదులుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news