స్వచ్ఛ భారత్ లో తెలంగాణకు అవార్డుల పంట

-

గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్‌లో పలు విభాగాల్లో ఏకంగా 13 అవార్డులు దక్కించుకున్నది తెలంగాణ రాష్ట్రం. పెద్ద రాష్ట్రాల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. జిల్లాల కేటగిరిలో రెండో స్థానంలో జగిత్యాల, మూడోస్థానంలో నిజామాబాద్‌ జిల్లాలు నిలిచాయి. అలాగే స్వచ్ఛ్‌ సర్వేక్షన్‌ గ్రామీణ్‌ (ఎస్‌ఎస్‌జీ) సౌత్‌ కేటగిరిలో నిజామాబాద్‌కు రెండోస్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో ర్యాంక్‌ను సాధించింది. సుజలాం 1.0, సుజలాం 2.0 క్యాంపెయిన్‌లో తెలంగాణ వరుసగా మూడు, రెండు స్థానాల్లో నిలిచింది. నేషనల్‌ ఫిల్మ్‌ కాంపిటిషన్‌ (జీపీ)లో రాష్ట్రానికి చెందిన ఎక్కూరు మండలం నూకలంపాడు గ్రామం రెండోస్థానంలో నిలువగా.. వాల్‌ పేయింటింగ్‌ కాంపిటిషన్‌లో బయోడీగ్రేడబుల్‌ వేస్టేజ్‌ మేనేజ్‌మెంట్‌, పాస్టిక్‌ వేస్టేజ్‌ మేనేజ్‌మెంట్, గోబర్‌ధాన్‌, గ్రేవాటర్‌ మేనేజ్‌మెంట్‌ సౌత్‌జోన్‌ కేటగిరిలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది.

స్వచ్ఛ భారత్‌లో తెలంగాణకు అవార్డుల పంట..

 

ఈ మేరకు రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్ లేఖ రాశారు. ఇదిలా ఉండగా.. స్వచ్ఛ భారత్‌ దివస్‌ సందర్భంగా అక్టోబర్‌ 2న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందించనున్నారు. రాష్ట్రానికి అవార్డులు రావడంపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ చొరవతోనే అవార్డులు వచ్చాయన్నారు. ప్రశంసలు, అవార్డులు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డులతో పాటు నిధులు కూడా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news