నేటి నుంచి మెట్రోసేవలు రాత్రి 11గంటల వరకు

-

ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని రాత్రి 11 గంటల వరకు పొడిగించారు. కొత్త వేళలు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటివరకు టెర్మినల్‌ స్టేషన్‌ నుంచి చివరి రైలు రాత్రి 10.15 గంటలకు ఉంటే.. తాజా మార్పుతో ప్రయాణికులకు 45 నిమిషాలు అదనంగా సేవలు అందనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ అధికారులు తెలిపారు. క్యూ లైన్‌ లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో వాట్సాప్‌ ద్వారానే టికెట్‌ కొనుగోలు చేసి.. ప్రయాణం చేసేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు.

Hyderabad metro services resume september 7 timings travel guidelines  unlock 4 | India News – India TV

ప్రస్తుతం చివరి ట్రైన్ 10.15 గంటల వరకే ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకే మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. అయితే ఏదైన ప్రత్యేక సమయాల్లో మాత్రం మెట్రోను అర్ధరాత్రి వరకు నడుపుతున్నారు. ప్రస్తుతం మరో గంటపాటు టైమింగ్ ను పొడగించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news