ఎడిట్ నోట్: ఈనాడు వర్సెస్ విజయసాయి..!

-

ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి..అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే..ఆ రెండు పార్టీల మధ్యే కాదు..ఆ పార్టీలకు చెందిన మీడియా సంస్థల మధ్య కూడా వార్ నడుస్తోంది. వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియాల రాజకీయాలు వేరే లెవెల్‌లో ఉంటున్నాయి. అయితే వైసీపీ అనుకూల మీడియాని బ్లూ మీడియా అంటూ టీడీపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే టీడీపీ అనుకూల మీడియాని యెల్లో మీడియా అని, దుష్టచతుష్టయం అంటూ వైసీపీ వాళ్ళు ఫైర్ అవుతున్నారు. వైసీపీ విమర్శించే మీడియా సంస్థల్లో ఈనాడు కూడా ఒకటి. అయితే ఈనాడు సంస్థ ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా కథనాలు ఇచ్చి వైసీపీని విమర్శించలేదు. టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై చేసే విమర్శలు, ఆరోపణలని ఎక్కువ హైలైట్ చేసేది. అయినా సరే ఈనాడుపైన, ఈనాడు అధినేత రామోజీరావుపైన వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు…ఒకానొక దశలో రామోజీరావుని పరుష పదజాలంతో దూషించిన సందర్భాలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఈనాడు తమ పవర్ ఏంటో చూపించాలనే దిశగా ముందుకెళుతుంది..వైసీపీ ప్రభుత్వం చేసే తప్పిదాలపై ప్రత్యక్షంగా కథనాలు ఇస్తూ వస్తుంది. ఆ మధ్య రాజధాని విషయంలో పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చింది. అమరావతిపై వైసీపీ విషం చల్లుతుందని చెప్పుకొచ్చింది. అలాగే పోలవరం విషయంలో వైసీపీ చేసే కార్యక్రమాలని హైలైట్ చేసింది. ఇక విశాఖ రాజధాని కోసమంటూ వైసీపీ పోరాటం మొదలుపెట్టింది. జే‌ఏ‌సి ఏర్పాటు చేసి రాజకీయం నడిపిస్తుంది..అలాగే ఉత్తరాంధ్రకు టీడీపీ ద్రోహం చేస్తుందని హైలైట్ చేస్తుంది.

ఈ క్రమంలో విశాఖకు గాని, ఉత్తరాంధ్ర జిల్లాలకు గాని వైసీపీ ఏం చేయలేదని చూపిస్తూ ఈనాడు కథనం ఇచ్చింది. ఇక విశాఖలో వైసీపీ చేసే అక్రమాలు అంటూ హైలైట్ చేసింది. ముఖ్యంగా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసింది. గతంలో ఒక ఇల్లు తప్ప విశాఖలో తనకు గాని, తన బంధువులకు గాని సెంటు భూమి లేదని విజయసాయి చెప్పుకొచ్చారు. దీనికి ఈనాడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. విజయసాయి బంధువులకు, దసపల్లా భూముల్లో జరిగిన అక్రమాలని ఆధారాలతో సహ బయటపెట్టింది.

దీనికి విజయసాయి కౌంటర్ ఇచ్చారు. తన కుమార్తెకు వ్యాపారాలు, భూములు ఉంటే అవి తనవి ఎందుకు అవుతాయని మాట్లాడారు. అలాగే ఈనాడుకు ధీటుగా చానల్, పత్రిక పెడతానని చెప్పుకొచ్చారు. అయితే విజయసాయి కౌంటర్‌లో పూర్తిగా కాన్ఫిడెన్స్ కనిపించలేదు. ఈ విషయంపై ఈనాడు మళ్ళీ కౌంటర్ ఇచ్చింది..వివరణ ఇచ్చారో..లేక వైసీపీలో విభేదాలు ఉన్నాయని చెబుతున్నారా? అని కథనం ఇచ్చింది. విజయసాయి పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారని, భూ అక్రమాలపై సరైన వివరణ ఇవ్వలేకపోయారని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈనాడు వర్సెస్ విజయసాయి అన్నట్లు పోరు నడిచింది. మరి రానున్న రోజుల్లో ఈనాడు..ఎవరిని టార్గెట్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news