ఉద్యోగి తొలగించిన సంస్థ.. జరిమానా విధించిన కోర్టు

-

ఓ సంస్థలో పనిచేసే వ్యక్తి వర్క్‌ ఫ్రం హోం విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. సదరు వ్యక్తి వెబ్‌ కామ్‌ మధ్యలో ఆగిపోవడంతో సదరు ఉద్యోగిని ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో కోర్టు మెట్లు ఎక్కాడు సదరు ఉద్యోగి. దీంతో న్యాయస్థానం ఆ సంస్థకు భారీగా జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన ‘చేటు’ అనే టెలీమార్కెటింగ్ కంపెనీ కూడా తన ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచించింది. అంతేకాదు, ఉద్యోగులు తమ ల్యాప్ టాప్/పీసీ స్క్రీన్ ను కంపెనీ అధికారులకు షేర్ చేయాలని, ఉద్యోగులు పనివేళల్లో లైవ్ వీడియోలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. అయితే నెదర్లాండ్స్ దేశం నుంచి పనిచేసే ఓ ఉద్యోగి పనివేళల్లో వెబ్ కామ్ ను ఆన్ చేయకపోవడంతో సదరు కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెబ్ కామ్ ఆపేసి విధులు నిర్వర్తించాడన్న కారణంతో అతడిని ఉద్యోగం నుంచి పీకిపారేసింది.

Kerala High Court Verdict On MediaOne Appeal Against Ban Likely On Wednesday

దాంతో అతడు తన స్వదేశంలో కోర్టును ఆశ్రయించాడు. వెబ్ కామ్ ద్వారా నిఘా వేయడం అనేది ఓ వ్యక్తి ఏకాంతానికి భంగం కలిగించడమేనని, స్క్రీన్ ను షేర్ చేయాలని కోరడం ట్రాక్ చేసేందుకేనని అతడు ఆరోపించాడు. అతడి పిటిషన్ పై స్పందించిన డచ్ న్యాయస్థానం ‘చేటు’ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెబ్ కామ్ నిఘాలో పనిచేయాలని ఉద్యోగులను బలవంతం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంది. ఆ కంపెనీకి రూ.60 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని సదరు ఉద్యోగికి చెల్లించాలని అమెరికా కంపెనీని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news