Breaking : పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏడాది కూడా 6 పేపర్లే

-

తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు విద్యా శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవ‌త్స‌రం కూడా 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా 6 పేప‌ర్లే నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ ప్ర‌తిపాదించింది. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా 2021లో 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా 6 పేప‌ర్ల‌కు కుదిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఏడాది క‌రోనా ఉధృతి కార‌ణంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వీలు కాలేదు.

Telangana TS SSC exam time table 2021 released, check now | Education  News,The Indian Express

ఇక 2022లో విద్యాశాఖ టెన్త్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. అప్పుడు 6 పేప‌ర్ల‌కు కుదించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మ‌ళ్లీ తాజాగా 2023 లోనూ 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు విద్యా శాఖ ప్రతిపాదన మేరకు అనుమతి ఇచ్చింది ప్ర‌భుత్వం. గ‌తంలో తెలుగు, ఇంగ్లీష్‌, గ‌ణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం స‌బ్జెక్టుల‌ను రెండు పేప‌ర్లుగా నిర్వ‌హించేవారు. ఇక హిందీ స‌బ్జెక్ట్‌కు ఒకే ప‌రీక్ష నిర్వ‌హించేవారు. కరోనా కార‌ణంగా 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా 6 పేప‌ర్ల‌కే కుదించారు విద్యా శాఖ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news