ఎడిట్ నోట్: మైలేజ్..డ్యామేజ్.!

-

అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలని అణిచివేయాలని చూస్తూ ఉంటాయి. అలా చేయడం వల్ల తమ బలం ఇంకా పెరుగుతుందని అనుకుంటారు..కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉంటాయి..ప్రతిపక్షాల బలం పెరిగి..అధికార పార్టీ బలం తగ్గుతుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌కు ఎక్కడకక్కడ చెక్ పెడుతూ వచ్చింది. ఆయన పర్యటనలు అడ్డుకోవడం, పోలీసులతో నిర్భందించడం లాంటివి చేశారు. దీని వల్ల జగన్ మైలేజ్ పెరిగి..టీడీపీకి డ్యామేజ్ జరిగింది.

అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అదే ఫార్ములాతో ముందుకెళుతుంది. చెప్పాలంటే ఇంకా ప్రతిపక్షాలని దారుణంగా నిర్భందాలకు గురి చేస్తుంది. చంద్రబాబు పర్యటనలని పలు సందర్భాల్లో అడ్డుకోవడం, పోలీసుల చేత నిర్భందించడం లాంటివి చేశారు. దీని వల్ల వైసీపీకి ఒరిగింది ఏమి లేదు..కానీ చంద్రబాబుకు ప్లస్ అయింది. ఆఖరికి లోకేష్ విషయంలో అదే చేస్తూ వచ్చారు. దీంతో లోకేష్ ఇమేజ్ కూడా పెరిగింది. ఇప్పుడు పవన్ వంతు వచ్చింది. కాకపోతే ఇప్పటివరకు పవన్‌ని పోలీసులు పెద్దగా అడ్డుకున్న సందర్భాలు లేవు.

వైసీపీ ప్రభుత్వం కూడా పవన్‌ని నిలువరించే సాహసం కూడా చేయలేదు..ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ గురించి చెప్పాల్సిన పని లేదు. అలాగే కాపు వర్గంలో యాంటీ వస్తుందనే భయంతో పవన్‌ని ఆపే కార్యక్రమాలు చేయలేదు. కానీ తాజాగా విశాఖలో మాత్రం పవన్‌కు బ్రేకులు వేశారు. వైసీపీ విశాఖ గర్జన రోజే పవన్ విశాఖలో ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో మంత్రులు రోజా, జోగి రమేష్‌లని జనసేన శ్రేణులు టార్గెట్ చేసి నిరసనలు తెలిపాయి. దీంతో పవన్ ర్యాలీకి పోలీసులు పలు ఆంక్షలు పెట్టారు. తీరా జనవాణి కార్యక్రమానికి పర్మిషన్ లేదని చెప్పి పవన్‌కు నోటీసులు ఇచ్చారు. అయితే పవన్ మాత్రం..అరెస్ట్ అయిన తమ నేతలు, కార్యకర్తలని వదిలే వరకు విశాఖలోనే నోవాటేల్ హోటల్‌లోనే ఉంటానని ఉండిపోయారు. ఇక హోటల్ దగ్గర పోలీసులు ఫుల్ బందోబస్తు పెట్టారు.

ఇక పవన్‌ని అరెస్ట్ చేశారని ప్రచారంతో హోటల్ దగ్గరకు జనసేన శ్రేణులు భారీగా వచ్చారు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నారు. హోటల్‌లోనే ఉంటూ పవన్..అభిమానులకు అభివాదం చేస్తూ ఉన్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా వైసీపీపై విరుచుకుపడ్డారు. పవన్‌కు చంద్రబాబుతో సహ ఇతర పార్టీ నేతలు మద్ధతు తెలిపారు. పవన్ ఇష్యూ నేషనల్ స్థాయిలో సెన్సేషన్ అయింది. ఇలా అవ్వడానికి వైసీపీ ప్రభుత్వమే ప్రధాన కారణమైంది.

ఒకవేళ పర్మిషన్ ఇచ్చి ఉంటే పవన్..జనవాణి కార్యక్రమం చేసుకుని సైలెంట్‌గా వెళ్లిపోయేవారు..కానీ ఆయనకు బ్రేకులు వేసి..ఫుల్‌గా హైలైట్ చేసింది. మొత్తానికి ఈ విశాఖ ఎపిసోడ్ గమనిస్తే..పవన్‌కు మైలేజ్ పెరగగా, వైసీపీకి డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news