ఒక్కొక్కసారి మన మూడ్ బాగోదు అటువంటి సమయంలో మనం దాని నుండి బయట పడాలని అనుకుంటూ ఉంటాము. అయినప్పటికీ ఆ మూడ్ నుండి బయటకు రావడం కష్టమవుతూ ఉంటుంది. ఒకవేళ కనుక మీకు కూడా తరచూ ఇలా అనిపిస్తూ ఉంటే ఈ చిట్కాలను ఫాలో అయితే బ్యాడ్ మూడ్ నుండి బయట పడొచ్చు. మరి మనం బ్యాడ్ మూడ్ నుండి ఎలా బయటపడొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.
కాసేపు తోటపనులు చేయండి:
చాలామంది గార్డెనింగ్ చేసి ఒత్తిడిని అంతటినీ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. బ్యాడ్ మూడ్ ఉన్నప్పుడు కూడా కాసేపు మొక్కల వద్ద సమయం గడిపే బాగుంటుంది ఇలా చేయడం వల్ల మంచిగా మీ మూడ్ ని మార్చుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ చుట్టుపక్కల కానీ మీ ఇంట్లో కాని మొక్కలు ఉంటే వాటితో కాస్త సమయం గడపండి.
స్నేహంగా ఉండే వారితో మాట్లాడండి:
మీకు నచ్చిన వ్యక్తులతో కాసేపు మాట్లాడి చూడండి. దీనితో మూడ్ ని మార్చుకోవచ్చు కావాలంటే ఎప్పుడైనా మీరు ఆఫీస్ లో ఉన్నప్పుడైనా లేదంటే ఇంట్లో వున్నా సరే మూడ్ బాలేక పోతే ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఇష్టమైన వ్యక్తులు దూరంగా ఉంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి పక్కనే ఉంటే కాసేపు కూర్చుని మాట్లాడండి.
మంచిగా నిద్రపోండి:
మంచి నిద్ర వలన ఆరోగ్యం బాగుంటుంది అలానే రోజంతా కూడా ఆనందంగా ఉండడానికి అవుతుంది. కాబట్టి సరిగ్గా వేళకు నిద్రపోతూ ఉండండి.
వర్క్ తో విసిగిపోకండి:
చాలామంది ఎక్కువ సమయం వర్క్ చేస్తూ ఉంటారు దీని వలన అస్సలు
మూడ్ బాగోదు పైగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కచ్చితంగా మీకు ఉన్న సమయంలో కాస్త సమయాన్ని వర్క్ చేసుకుని మిగతా సమయంలో రిలాక్స్ గా ఉండండి.