ఎడిట్ నోట్: ఇదేం రచ్చ..!

-

తెలంగాణలో టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య పోరు నడుస్తూనే ఉంది..మునుగోడు ఉపఎన్నిక ముగిసిన సరే..రెండు పార్టీల మధ్య రాజకీయ రచ్చ ఆగడం లేదు. రెండు పార్టీలు సైతం రాజకీయం చేయడంలో బాగా బిజీగా ఉన్నాయి..పార్టీల పరంగానే కాదు…ప్రభుత్వాల పరంగా పోరు జరుగుతుంది. ఓ వైపు తెలంగాణ వర్సెస్ కేంద్రం అన్నట్లు వార్ నడుస్తోంది. మరోవైపు తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ అనే విధంగా రాజకీయ రచ్చ నడుస్తోంది. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండి కూడా రెండు వైపులా రాజకీయ క్రీడ జరుగుతుంది.

ఈ నెల 12న మోదీ రామగుండంకు వచ్చి..ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. కానీ ఎప్పుడో ఓపెన్ అయిన ఫ్యాక్టరీని ఇప్పుడు జాతికి అంకితం చేయడం ఏంటని టి‌ఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఇక మోదీ పర్యటనలో ప్రోటోకాల్ పాటించడం లేదని, కే‌సి‌ఆర్‌ని పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాజాగా కే‌సి‌ఆర్ పంపిన ఆహ్వానంలో ప్రోటోకాల్ పాటించలేదని, మోదీ తర్వాత పేరు కే‌సి‌ఆర్‌ది లేదని ఫైర్ అవుతున్నారు.

అయినా మోదీ పర్యటనకు కే‌సి‌ఆర్ వెళ్ళడం కష్టమే అని తేలిపోయింది..ప్రోటోకాల్ ప్రకారం అధికారులు, మంత్రులు వెళ్ళి ప్రధానికి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నాయి. ఇలా మోదీ పర్యటనపై రచ్చ జరుగుతుంటే..మరోవైపు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ అన్నట్లు పోరు నడుస్తోంది. యూనివర్సిటీల్లో నియమకాలకు సంబంధించిన బిల్లు అంశంపై కే‌సి‌ఆర్ ప్రభుత్వం, గవర్నర్ తమిళసైల మధ్య వార్ నడుస్తోంది.

ఇదే క్రమంలో గవర్నర్‌పై మంత్రులు విమర్శలు చేస్తున్నారు. దీంతో తమిళసై ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి..కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజ్ భవన్ గౌరవాన్ని దిగజార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులుపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోకి రాజ్‌భవన్‌ను లాగాలను రాష్ట్ర ప్రభుత్వం చూసిందని, తుషార్ పేరు ఫాంహౌస్ కేసులో ఉంటే.. ఆ కేసులోకి రాజ్ భవన్‌ను లాగుతారా? అని నిలదీశారు. తుషార్ గతంలో తన దగ్గర ఏడీసీగా పనిచేశారన్నారు. ఫాంహౌస్ కేసులో ఉన్న తుషార్.. ఈ తుషార్ వేర్వేరని.. అయినా.. గవర్నర్‌పై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. రాజ్ భవన్.. ప్రగతి భవన్‌లా కాదని ఎవరైనా రావచ్చని తమిళిసై అన్నారు.

మొత్తానికి ఇలా టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య పార్టీల పరంగానే కాదు..ప్రభుత్వాల పరంగా రాజకీయ రచ్చ జరుగుతుంది. ఈ రెండు పార్టీలు రాజకీయమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వాలు..రాజకీయ లబ్ది పొందే దిశగా పనిచేస్తున్నాయి. పూర్తిగా రెండు పార్టీలు రాజకీయ రచ్చ లేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news