581 కేజీల గంజాయిని ఎలుకలు తినేశాయాట.. కోర్టుకు చెప్పిన అధికారులు..! నిజమేనా..?

-

ఎలుకలు కూరగాయలు, స్వీట్స్‌ తింటాయి.. కానీ గంజాయి తినడం మీరెప్పుడైనా విన్నారు..కానీ తిన్నాయంట..పోలీసులు చెప్తున్నారు. గంజాయి రవాణా చేస్తూ..పట్టుబడిన సరకును పోలీసులు సీజ్‌ చేసి కోర్టుకు అప్పగించాలి.. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మథురలో అధికారులు పట్టుబడిన గంజాయి ఎలుకలు తినేశాయని కోర్టుకు చెప్పడంతో..అందరూ ఆశ్చర్యపోయారు.. నిజంగా ఎలకులు తిన్నాయా.. ఇంకేమైనా జరిగిందా..? సరే తిని ఉంటే.. కేజీ రెండు కేజీలు అనుకుందా.. కానీ ఏకంగా 581 కేజీల గంజాయిని తింటాయా..? పోలీసులు చెప్పిన సమాధానంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు కావాలంది..
ఉత్తర ప్రదేశ్ షేర్‌గఢ్‌లోని గోదాములు, హైవే పోలీస్ స్టేషన్లలో గంజాయి నిల్వ చేశారు. ఇందులో దాదాపు 581 కేజీల గంజాయినిని ఎలుకలు తినేశాయని మథుర పోలీసులు స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కోర్టుకు చెబుతూ నివేదిక అందించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని కోర్టులో సమర్పించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. దీంతో అధికారులు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిలో 386 కేజీలను షేర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో, 195 కేజీలను హైవే పోలీస్ స్టేషన్‌లో దాచిపెట్టారు. పోలీసుల నివేదిక చూసి విస్తుపోయిన అదనపు జిల్లా జడ్జి తగిన సాక్ష్యాన్ని తీసుకురావాలని చెప్పారు. ఈ నెల 26వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు.. హైవే పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చోటె లాల్ ఇంకో కథ చెప్తన్నారు.. అక్టోబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదాములోకి నీళ్లు చేరాయని, గంజాయి మొత్తం పాడైపోయిందని పేర్కొన్నారు. షేర్‌గఢ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సోను కుమార్ కూడా ఇలాంటి వివరణే ఇవ్వడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే.. గంజాయి గంగాపాల్‌ కాదు… సైడ్‌ చేసి సిల్లీ రీజన్స్‌ చెప్తున్నారు అనిపిస్తోంది కదా..! కోర్టు కూడా అధికారులు చెప్పే సాకులు ఏమాత్రం నమ్మడం లేదు. ఆధారాలు అడిగింది కానీ.. ఎంతమేరకు ఆధారాలు సమర్పిస్తారో చూడాలి.. ప్రస్తుతానికి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news