వచ్చే ఏప్రిల్ నుంచి వైజాగ్ లో 5జీ సేవలు ప్రారంభించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని GVL నరసింహారావు పేర్కొన్నారు. విశాఖ నుంచి మూడు వందేభారత్ రైళ్లు కోసం కేంద్రం దగ్గర ప్రతిపాదన పెట్టామన్నారు GVL నరసింహారావు.
రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, విశాఖ భూ కబ్జాల పై బహిరంగ చర్చకు సిద్ధమా….త్వరలోనే బహిరంగ చర్చకు పిలుస్తామని వైసీపీ,టీడీపీలకు ఎంపి జీవీఎల్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం నిర్మిస్తుంటే వైసీపీ,టీడీపీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి …పోలవరం నిర్మాణం ఆలస్యంకు వైసీపీ ప్రభుత్వం చేతకాని తనం కారణమన్నారు.కేంద్రం నిధులిస్తే ప్రాజెక్ట్ ప్రారంభించిన చంద్రబాబు కమిషన్ల కోసం పోలవరం తీసుకున్నారు.. 14ఏళ్ల ముఖ్యమంత్రిగా వుండి రాష్ట్రంలో ఎందుకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు రాలేదని ఫైర్ అయ్యారు.