పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ.. ఐప్యాక్ నివేదికపై చర్చించే అవకాశం

-

వైసీపీ జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి50 మంది ఓటర్లకు పార్టీలో పని చేస్తున్న ఇద్దరిని వాలంటీర్లుగా నియమించాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్ వ్యవస్ధపై.. పూర్తిస్ధాయిలో ఆధారపడలేమని పార్టీలో అభిప్రాయం వ్యక్తమవున్న నేపథ్యంలో సీఎం ఈ ఆలోచన చేసినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ కీలక భేటీని నిర్వహించబోతున్నారు.

Andhra Pradesh CM Jagan Mohan Reddy inducts 14 new faces in Cabinet

ఇదే సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఐప్యాక్ అందించిన నివేదికపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా మార్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. గడపగడపకు కార్యక్రమంపై రిపోర్టును పార్టీ శ్రేణుల ముందు ఉంచి, వారికి సూచనలు చేయనున్నారు. మార్పులు, చేర్పులపై సూచనలు చేయనున్నారు. గడపగడపకు పురోగతిపైనా రిపోర్టును సైతం.. ఇవాళ వారి ముందుంచి.. సీఎం జగన్ సూచనలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news