MLA చెన్నకేశవరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో గల ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీఆర్ఏలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతుందన్నారు. వీఆర్వో, వీఆర్ ఏలను అటెండర్లుగా పంపాలన్నారు. వారిపై పర్యవేక్షణకు అధికారిని నియమించాలన్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి.. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంత సిద్దం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి.

ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ప్రశంసలు కురిపించారు.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అన్నారు… బీజేపీ అధికారం లేని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఆఫర్ చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక తాటి పైకి వచ్చి.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్ కేశవరెడ్డి.. ఇక, గతంలో గోవ నిషేధ చట్టంపై హాట్‌ కామెంట్లు చేశారు చెన్నకేశవరెడ్డి.. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేసిన ఆయన.. ఇది కాలం చెల్లిన పాత చట్టాల్లో ఒకటని.. ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news