పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు.. ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదని న్యాయస్థానం బలంగా నమ్ముతుంది.. అందుకే ఆధారాలు లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు.. నెలలు, సంవత్సరాలు గడిచినా కోర్టుల నుంచి సరైన న్యాయమే వస్తుందని నమ్ముతారు.. కానీ ఒక్కోసారి ఇది రివర్స్ అవుతుంది. చేయనితప్పుకు అమాయకులు శిక్ష అనుభవిస్తారు.. ఈ స్టోరీ కూడా అలాంటిదే.. సామూహిక అత్యాచారం కేసులో ఒక వ్యక్తి రెండేళ్లు శిక్ష అనుభవించాడు.. కానీ అతను నిర్దోషి అని తేలడంతో.. ఆ వ్యక్తి.. ప్రభుత్వం నుంచి భారీ పరిహారం కోరుతూ కోర్టులో దావా వేశాడు.
సామూహిక అత్యాచారం కేసులో నిర్దోషిగా తేలిన ఓ వ్యక్తి.. ప్రభుత్వం నుంచి భారీ పరిహారం కోరుతూ కోర్టులో దావా వేశాడు. అతను కోరింది.. కోటి, 10 కోట్లు కాదు. ఏకంగా రూ.10,000 కోట్లకు పైనే..! ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రత్లామ్‌కు చెందిన 35 ఏళ్ల కాంతిలాల్ భీల్ గ్యాంగ్ రేప్ కేసులో రెండేళ్ల పాటు జైలులో ఉన్నాడు. కోర్టు అతణ్ని నిర్దోషిగా ప్రకటించిన తర్వాత.. ఇంత మొత్తంలో పరిహారం కోరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కేసును రత్లామ్‌లోని స్థానిక సెషన్స్ కోర్టు ఈ నెల 10న విచారించనుంది.
కాంతిలాల్ భీల్.. రత్లామ్ వాసి. 2018 జులై 20న భీల్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ మానస పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. భీల్ తనను తన సోదరుడి ఇంటి వద్ద దింపుతానని నమ్మించి.. అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. అనంతరం మరో వ్యక్తికి అప్పగించాడని.. అతను తనపై 6 నెలల పాటు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఈ కేసులో భీల్‌ను పోలీసులు 2020 డిసెంబరు 23న అరెస్ట్ చేశారు. రెండేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత.. ఇప్పుడు అతను నిర్దోషి అని తేలింది.. మరీ కోర్టు రత్లామ్ అడిగిన పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.. ఒక వ్యక్తి జీవితంలో రెండేళ్లు వృద్ధాగా పోవడం అంటే చిన్న విషయం కాదు. టైమ్ వేస్ట్, సమాజంలో పరువు పోయింది. ఈ మధ్య ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.. కానీ ఇంత మొత్తంలో పరిహారం డిమాండ్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి..!