BREAKING: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్

-

టెన్త్ విద్యార్థుల సర్టిఫికెట్లలో లోపాల సవరణకు ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు ఎడిట్ ఆప్షన్ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. హెడ్మాస్టర్లు తమ స్కూలు నుంచి టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాల్లో పొరపాట్లను సవరించవచ్చు. స్కూల్ లాగిన్ నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ వినియోగించి నామినల్ రోల్స్ లోని వివరాలను సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. నేటి నుంచి ఈనెల 20 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. టెన్త్‌ వివరాల్లో తప్పులు చివరి నిమిషంలో వాటిని సరిచేయించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతుంటారు. టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన నామినల్‌ రోల్స్‌లో వారి వివరాలను సరైన రీతిలో పొందుపరచకపోతే అవే పొరపాట్లు ధ్రువపత్రాల్లో నమోదవుతుంటాయి.

ఈ సమస్యలకు ముందుగానే చెక్‌పెట్టేలా ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఎడిట్‌ ఆప్షన్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు తమ స్కూలు ద్వారా టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలను సరిచూసుకుని పొరపాట్లు లేకుండా సవరించుకునేందుకు ఈ ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్‌ లాగిన్‌ నుంచి ఈ ఎడిట్‌ ఆప్షన్‌ వినియోగించి నామినల్‌ రోల్స్‌లోని వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. జనవరి 11 నుంచి 20వ తేదీవరకు ఈ ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆలోగా వివరాలు సరిచూసుకోవాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news