రుపే కార్డ్‌పై క్యాష్‌ బ్యాక్ ఆఫర్.. సర్కార్ భారీ గిఫ్ట్..!

-

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2600 కోట్ల పథకానికి ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భీమ్ UPI, రూపే డెబిట్ కార్డ్‌ల ద్వారా చేసే లావాదేవీలపై వినియోగదారులకు ఆర్థిక ప్రోత్సాహకం ఇస్తున్నారు. క్యాష్‌బ్యాక్‌గా దీన్ని తీసుకోవడానికి అవుతుంది.

ఈ ఆర్థిక సంవత్సరం లో పాయింట్ ఆఫ్ సేల్ చెల్లింపు యంత్రాలు, రూపే, UPI ఉపయోగించి ఇ-కామర్స్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను బ్యాంక్ ఇవ్వనుంది. రూపే కార్డు ద్వారా పేమెంట్ల కి 0.4 శాతం ప్రోత్సాహకం ఇస్తారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు. అలానే భీమ్ UPI ద్వారా రూ. 2000 కంటే తక్కువ లావాదేవీల పై 0.25 శాతం ప్రోత్సాహకం ఉంటుంది.

ఒకవేళ కనుక మీరు బీమా, మ్యూచువల్ ఫండ్స్, జ్యువెలరీ, పెట్రోలియం ఉత్పత్తులు వంటి వాటి కోసం భీమ్ UPI ని ఉపయోగిస్తే.. అప్పుడు మీకు 0.15 శాతం ప్రోత్సాహకం వస్తుంది. యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు రూ. 12 లక్షల కోట్లకు డిసెంబర్‌ లో చేరుకున్నాయి. 2022 సంవత్సరం లో అయితే యుపీఐ ద్వారా 7404 కోట్ల లావాదేవీలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news