వాల్లేరు వీరయ్యకు కొన్ని వెబ్‌ సైట్లు 2.23 రేటింగ్‌ ఇచ్చాయి – చిరంజీవి

-

వాల్తేరు వీరయ్యకు కొన్ని వెబ్‌ సైట్లు 2.23 రేటింగ్‌ ఇచ్చాయని మెగాస్టార్‌ చిరంజీవి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేర్‌ వీరయ్య’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స నిర్మించిన ఈ చిత్రంలో, మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న రిలీజైంది. తొలి వారంలోనే సినిమా లాభాల బాట పట్టింది. అయితే, తాజాగా చిరంజీవి తన సినిమాపై ప్రచారం చేస్తున్న వారికి చురకలు అంటించారు. “చిన్న జోక్ చెప్తాను.ఎవ్వరిని criticize చెయ్యడానికి కాదు. టేక్ ఇట్ ఈజీ ! వెబ్ సైట్స్ 2.25 అలా రేటింగ్ ఇచ్చాయి. వాళ్లు ఇచ్చిన రేటింగ్ ఏమిటో తెలుసా 2.25 అంటే .. మిలియన్స్ అని.. 2.25 మిలియన్స్ అని తర్వాత అర్థం అయింది ” అని చిరంజీవి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news