రేపటినుండే రేవంత్ రెడ్డి “హాథ్ సే హథ్ జోడో” పాదయాత్ర

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపటి నుంచి ” హాథ్ సే హాథ్ జోడో” పాదయాత్రను ప్రారంభించనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ఈ పాదయాత్రకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనుండగా.. రేపు ములుగులో ఘట్టమ్మ, సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు.

మేడారం గుడి నుంచి పాదయాత్ర బయలుదేరి తాడ్వాయి మండలంలోని కొత్తూరు, నార్లాపూర్, వెంగలాపూర్ గ్రామాల మీదుగా గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్ట్ నగర్ గ్రామం మీదుగా పాదయాత్ర సాగనుంది. వెంకటాపూర్ క్రాస్ రోడ్డు మీదుగా పాలంపేటకు చేరుకొని రాత్రికి రేవంత్ రెడ్డి అక్కడే బస చేస్తారు. ఇక రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు బందోబస్తు కల్పించాలంటూ ఎమ్మెల్యే సీతక్క ములుగు ఎస్పీ గౌస్ ఆలంను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news