ఎడిట్ నోట్: బాబు-చినబాబు ‘షో’.!

-

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీని చాలావరకు బయటపడేశారు. ఓ వైపు అధికార వైసీపీ దెబ్బకు టి‌డి‌పి నేతలు, కార్యకర్తలు మొదటలో పెద్దగా బయటకురాని పారిటిటీ. కానీ ఆ పరిస్తితి నుంచి పార్టీని బయటకు తీసుకురావడమే కాదు. వైసీపీకి ధీటుగా నిలబెట్టారు. ఓ వైపు ప్రజల్లో తిరుగుతూ..ప్రజా బలాన్ని పెంచుకుంటూనే..మరోవైపు నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడుతూ…ఆయా స్థానాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

గతంలో మాదిరిగా మొహమాటం పోకుండా..పనితీరు బాగోని నేతలని పక్కన పెట్టి కొత్త నాయకులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇలా చేస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఇదే సమయంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడం కోసం నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు ప్రజలని కలుస్తూ..ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. అలాగే అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతల అక్రమాలు అంటూ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు.

 

అలాగే వర్గాల వారీగా ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల మద్ధతు పెంచుకునే దిశగా లోకేష్ పనిచేస్తున్నారు. ఇలా లోకేష్ పాదయాత్రతో ఓ వైపు పార్టీ కోసం కష్టపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు పార్టీని బలోపేతం చేస్తూనే..ప్రజల్లో మద్ధతు పెంచుకుంటున్నారు.

తాజాగా ఆయన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. బాబు సభలకు జనం కూడా భారీగానే వస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో బాబు కార్యక్రమం జరగగా, ప్రతి చోట మంచి స్పందనే వస్తుంది. ఇలా ఓ వైపు లోకేష్, మరో వైపు బాబు..ప్రజల్లో తిరుగుతూ పార్టీని బలోపేతం చేసేలా ముందుకెళుతున్నారు. ఇలా బాబు-చినబాబు రోడ్లపై తిరుగుతూ పార్టీ కోసం పడుతున్న కష్టం సక్సెస్ అవుతుందేమో చూడాలి. వీరి కష్టంతో టి‌డి‌పిని అధికారంలోకి తీసుకొస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news