వాతావరణ మార్పుల వల్ల చాలామంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. చలి ఎక్కువ ఉండటం.. చలిగాలి వలన చాలామంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. మీరు కూడా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా..? ఎక్కువమంది ఎదుర్కొంటున్న వాటిలో మైగ్రేన్ కూడా ఒకటి. ఈ సమస్య దీర్ఘకాలం వేధించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఈ సమస్య ని తగ్గించుకోవడానికి చూసుకోవాలి. చాలామంది మైగ్రేన్ బాధితులు ఉష్ణోగ్రత తేమ ఇతర వాతావరణ సంబంధిత మార్పులతో తలనొప్పిని ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ సమస్య అందరిలో ఒకేలా ఉండదు. ఒక్కో వ్యక్తికి ఒక విధంగా ఉండొచ్చు. వాతావరణ సంబంధిత మైగ్రేన్లను నివారించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి మరి వాటిని చూసేయండి.
మైగ్రేన్ కి కారణం ఒత్తిడి కూడా కావచ్చు కాబట్టి కాసేపు ప్రతిరోజూ యోగా మెడిటేషన్ శ్వాస వ్యాయములు చేస్తూ ఉండండి. అలానే ఇది ఒక రకమైన మానసిక సమస్య. సో మైగ్రేన్ సమస్య ని యోగాసనాలతో తగ్గించుకోవచ్చు. ట్రై చెయ్యండి.
నిద్ర కి అంతరాయం కలుగుతుంది కదా..? అది కూడా మైగ్రేన్ కి దారి తీయొచ్చు. ప్రతిరోజు రాత్రి తగినంత సేపు నిద్రపోండి. ఒకే సమయంలో నిద్ర పోయి ఒకే సమయంలో లేచే విధంగా ప్లాన్ చేసుకోండి. నిద్రలో మార్పులు రావడం వలన మైగ్రేన్ రావచ్చు.
వేడి తేమతో కూడిన వాతావరణం లో ఎక్కువ నీరు తాగితే మంచిది. లేకపోతే మైగ్రేన్ సమస్య రావచ్చు.
మైగ్రేన్ సమస్య రాకూడదంటే నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండండి.
అలానే మీరు ఈ సమస్య వచ్చే సమయాన్ని ట్రాక్ చేస్తూ ఉండండి. ఏ సమయంలో వస్తుందో ట్రాక్ చేయడం బట్టి సమస్యను గుర్తించొచ్చు.
భారోమెట్రిక్ పీడనం ఉష్ణోగ్రతల మార్పులు మెదడులోని రక్త ప్రవాహంలో మార్పులకి దారితీస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మైగ్రేన్ కనుక ఎక్కువ ఉంటే డాక్టర్ని సంప్రదించండి.