నాపై జరిగిన దాడి తెలంగాణ మహిళా సమాజంపై జరిగినట్లే – వైఎస్ షర్మిల

-

నేడు రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తన పాదయాత్రని అడ్డుకోవడంపై బుద్ధ భవన్ లోని మహిళా కమిషన్ ను కలిశారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించి తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని బిఆర్ఎస్ నేతలపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు తన పాదయాత్రను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని, తన వాహనాలను కూడా ధ్వంసం చేశారని షర్మిల మీడియాకు తెలిపారు.

అధికార పార్టీని విమర్శిస్తున్నందుకే తనను పదేపదే అడ్డుకుంటున్నారని, దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు వీటిని గమనిస్తున్నారని.. బిఆర్ఎస్ పార్టీ గుండాలకు అందరూ కలిసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అధికార పక్ష నాయకులకు ఒక న్యాయం.. ప్రతిపక్ష నాయకుల మహిళలకు మరో న్యాయమా? అంటూ నిలదీశారు. తనపై జరిగిన దాడి తెలంగాణ మహిళా సమాజం పై జరిగినట్లేనని అన్నారు.

తాను ఎక్కడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదని షర్మిల గుర్తు చేశారు. మహిళా కమిషన్ చైర్మన్ ను అపాయింట్మెంట్ అడిగిన సమయం ఇవ్వడం లేదని, రెండు మూడు రోజుల నుంచి ప్రయత్నం చేసిన మహిళా కమిషన్ అందుబాటులో లేదని, రాష్ట్ర మహిళా కమిషన్ చర్యలు తీసుకోకపోతే జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news