ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ముగిసింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితం విశాఖ వెళ్లిన సీఎం జగన్.. కాసేపటి క్రితమే విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు. ఈ సబ్మిట్ ద్వారా రూ. 13.56 లక్షల కోట్ల పెట్టుబడులపై 352 ఎంఓయు లు కుదిరాయి.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ – 2023లో ఏపీకి పెట్టుబడిన వరద పారింది. శాఖల వారిగా పెట్టుబడుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఎనర్జీ విభాగంలో రూ 9 లక్షల 7వేల 126 కోట్లు, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో 3 లక్షల 35 వేల 644 కోట్లు, ఐటీ అండ్ ఐటిఈఎస్ విభాగంలో 39 వేల 636 కోట్లు, పర్యాటక విభాగంలో 22 వేల 96 కోట్లు, వ్యవసాయ విభాగంలో 1, 160 కోట్లు, పశుసంవర్ధక విభాగంలో 1,020 కోట్లు.