ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈడీ ఆఫీసు లోపలికి వెళ్లిన కవిత… అందరికీ అభివాదం చేస్తూ లోపలికి ప్రవేశించారు కవిత. అంతేకాదు.. పిడికిలి బిగించి జై కొట్టి..ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు కవిత. కవితకు మద్దతుగా ఈడీ ఆఫీసు గేట్ వరకూ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు వచ్చారు.
ఇక ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరిం చారు. కాగా, ఇవాల్టి విచారణలో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఎమ్మెల్సీ కవితను విచారించనున్న ఈడి, ఆమెతో పాటు తొమ్మిది మందిని ఒకేసారి ప్రశ్నించనుంది.కవితతో పాటు మనీష్ సిసోడియా, అరుణ్ పి ళ్ళై, దినేష్ ఆరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్ లను ఒకేసారి విచారించనుంది.