ఎక్కువ మంది ఈ రోజుల్లో కిడ్నీ సమస్య తో బాధ పడుతున్నారు కిడ్నీ సమస్యలు వచ్చాయి అంటే దాని నుండి బయటపడడం ఎంతో కష్టం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ సూత్రాలను తప్పక పాటించండి. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఈ మూలికలని డైట్ లో చేర్చుకోండి అప్పుడు మీ కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
త్రిఫల:
త్రిఫల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది లివర్ కిడ్నీల ఆరోగ్యానికి బాగా సహాయ పడుతుంది కిడ్నీ ఫంక్షన్ కూడా బాగుంటుంది కాబట్టి త్రిఫల ని మీరు డైట్ లో తీసుకుంటూ ఉండండి.
అల్లం:
ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి అలానే అల్లం ని తీసుకోవడం వలన నొప్పి, వాపు వంటివి తగ్గిపోతాయి.
పసుపు:
పసుపులో చక్కటి గుణాలు ఉంటాయి కాబట్టి తరచూ వంటల్లో పసుపుని వాడుతూ ఉండండి ప్లాస్మా ప్రోటీన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అలానే సిరం, యూరియా, క్రియాటిన్ లెవెల్స్ ని తగ్గిస్తుంది కూడా.
తిప్పతీగ:
ఇది కూడా కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తిప్పతీగని కూడా ఆయుర్వేద వైద్యం లో ఎక్కువ వాడతారు కిడ్నీ సమస్యలు బారిన పడకుండా కూడా ఇది చూస్తుంది కాబట్టి దీన్ని కూడా తీసుకుంటూ ఉండొచ్చు.
ఆమ్లకి, హరితకి, విబితకి:
ఆమ్లకి, హరితకి, విబితకి కూడా మీకు బాగా ఉపయోగపడతాయి వీటిని కూడా మీరు తీసుకుని కిడ్నీలని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.