Telangana: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

-

వేసవి వచ్చేసింది. మార్చిలోనే మే నెలను తలపించే ఎండలు కొడుతున్నాయి. ఇక ఉక్కపోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం 9 గంటల తర్వాత బయటకు వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నారు. సూర్యుడి భగ భగలకు చాలా మంది మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉంటున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలకు ఈనెల 15వ తేదీన ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చే శారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించి పిల్లలను ఇంటికి పంపాలి. పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 3 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నందున ప్రత్యేక తరగతులను కొనసాగించాలని ఆదేశించారు.

విద్యార్థులకు ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నందున వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం. చేశారు. విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news