టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజ‌రాత్ కెప్టెన్ స్నేహ్ రానా..

-

గుజ‌రాత్ జెయింట్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ 16వ మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయ. టాస్ గెలిచిన గుజ‌రాత్ కెప్టెన్ స్నేహ్ రానా బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది . ఇంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ జ‌ట్ట‌ను బ‌ల‌మైన‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను ఓడించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆర్సీబీ కూడా యూపీ వారియ‌ర్స్‌పై విజ‌యం సాధించి టోర్న‌మెంట్‌లో బోణీ కొట్టడం జరిగింది. అయితే.. మొదటి రౌండ్‌లో స్మృతీ మంధాన సేన గుజ‌రాత్ చేతిలో 11 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైన విషయం తెలిసిందే . మ‌రి.. ఈసారి ఇరుజ‌ట్ల‌లో ఎవ‌రిది పై చేయి కానుంది? అనేది వేచి చూడాలి.

RCB vs GG | టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న గుజ‌రాత్ జెయింట్స్

ఆర్సీబీ జ‌ట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), రీచా ఘోష్ (వికెట్ కీప‌ర్), సోఫీ డెవినే, హీథ‌ర్ నైట్, క‌నికా ఆహుజా, ఎలిసే పెర్రీ, శ్రేయాంక పాటిల్, అషా శోభ‌న‌, ప్రీతీ బోస్, మేగ‌న్ ష‌ట్‌, దిశా క‌సాత్.

గుజ‌రాత్ జెయింట్స్ జ‌ట్టు : లారా వోల్వార్డ్త్‌, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హ‌ర్లీన్ డియోల్, అష్ గార్డ్‌న‌ర్, ద‌య‌లాన్ హేమ‌ల‌త‌, అశ్విని కుమారి, సుష్మా వ‌ర్మ (వికెట్ కీప‌ర్), కిమ్ గార్త్, త‌నుజా క‌న్వ‌ర్, స‌బ్బినేని మేఘ‌న‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news