కామారెడ్డి జిల్లాలోని రాజంపేట గ్రామంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పలు ఉద్యోగ నియామకాల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కేసులో చిన్న చిన్న వాళ్లను అరెస్ట్ చేయడం కాదని, ప్రశ్నాపత్రం లీకేజి వెనుక ఉన్న బీఆర్ఎస్ పెద్ద తలకాయలు బయటికి రావాలని మండిపడ్డారాయన. ఈ స్టోరీ వెనుక ఉన్న తిమింగలాలకు బహిరంగ శిక్ష విధించాలని డిమాండ్ చేసారు రేవంత్. కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి రాజంపేట గ్రామంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పైరవీకారులకు ముందే ప్రశ్నాపత్రాలు అందుతున్నాయని అన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని కోరారు.

Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు  మారనున్నాయా ?, Will revanth reddy decisions change after kc venugopal  questions in huzurabad by poll result review meeting ak ...

తాను ఐటీ మంత్రినని, ఈ వ్యవహారంతో తనకేంటి సంబంధం అని కేటీఆర్ అంటున్నారు… మరి ముఖ్యమంత్రి ఈ అంశంపై సమీక్ష జరిపితే నువ్వెందుకు హాజరయ్యావు? అని కేటీఆర్ ను పై వ్యాఖ్యలు చేసారు. నీకేమీ సంబంధం లేకపోతే ఇవాళ ఒకవైపు విద్యాశాఖా మంత్రిని, మరోవైపు ఎక్సైజ్ శాఖామంత్రిని ఎందుకు కూర్చోబెట్టుకుని మాట్లాడావు? ఐటీ మంత్రివి అయిన నీవు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సమీక్ష సమావేశంలో సిట్ అధికారులను ఎందుకు కూర్చోబెట్టలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేస్తే, ఇద్దరే నేరానికి పాల్పడ్డారని మంత్రిగా ఏ విధంగా ప్రకటన చేస్తారు? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇప్పటివరకు ఆ 9 మందిని విచారణ చేయలేదని, మరి కేటీఆర్ ఇద్దరే ఈ తప్పిదానికి పాల్పడ్డారని ఎలా విమర్శించారు.