ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. జీవో నెంబర్ 1 పై చర్చించాలని టిడిపి నేతలు పట్టుబట్టగా…. తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి… వైసిపి ఎమ్మెల్యే సుధాకర్ బాబు పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పై దాడి చేసిన ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇది శాసనసభ కాదు… కౌరవ సభ అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కారణంగా జగన్ కు పిచ్చెక్కుతుందని చురకలు అంటించారు చంద్రబాబు. ఏపీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.