ఐపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్ లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరాజయం పాలయింది. హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ బాధకు గురయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సన్ రైజర్స్ఆటగాళ్లు పూర్తిగా తెలిపోయారు.
రాజస్థాన్ రాయల్స్ నిర్ధేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో మూడో బంతికి అభిషేక్ శర్మ (0) క్లీన్‌బౌల్డ్ కాగా, ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి (0) ఇదే ఓవర్‌లో ఐదో బంతికి స్లిప్‌లో హోల్డర్‌కు చిక్కాడు. అనంతరం మయాంక్ (27), హ్యారీ బ్రూక్ (13) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ముందుకు నెట్టుకుంటూ వచ్చారు. అయితే వీరిద్దరిని చాహల్ పెవిలియన్ కు పంపాడు.
చాహల్ వేసిన 6.6 ఓవర్‌కు హ్యారీ బ్రూక్ (13) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అ వెంటనే వాషింగ్టన్ సుందర్ (1), గ్లెన్ ఫిలిప్స్ (8) కూడా ఔటయ్యారు. దీంతో 10 ఓవర్లకు50 స్కోర్ దాటకుండానే సన్ రైజర్స్ సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో మిగితా బ్యాట్స్మెన్స్ను రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో సన్ రైజర్స్ ఇన్ని్ంగ్స్ 8 వికెట్లుకు గానూ 131 పరుగుల ఆట ముగిసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్ల నష్లానికి 203 పరుగులు చేపట్టింది. జోస్ బట్లర్(54), జైస్వాల్(54), సంజూ శాంసన్ (55) రెచ్చిపోవడం తో రాజస్థాన్ జట్టు పెద్ద స్కోర్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖి, నటరాజన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశాడు.