షాకింగ్‌.. కాంగ్రెస్‌ ఫైల్స్‌ అంటూ బీజేపీ వీడియో

-

ఈరోజు బీజేపీ ‘కాంగ్రెస్ ఫైల్స్’ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం హయాంలో పాల్పడిన అవినీతిపై మొదటి ఎపిసోడ్‌ను విడుదల చేసింది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ వీడియో తొలి ఎపిసోడ్‌ను బీజేపీ రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ఫైల్స్ మొదటి ఎపిసోడ్, కాంగ్రెస్ పాలనలో ఒకదాని తర్వాత ఒకటి అవినీతి, కుంభకోణాలు ఎలా జరిగాయో చూడండి’ అని బీజేపీ ట్వీట్ చేసింది. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని వివరిస్తూ మూడు నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్ చేసింది.ఈ వీడియో మెసేజ్‌కు ‘కాంగ్రెస్ అంటే అవినీతి’అని పేర్కొంది. ప్రస్తుతం విడుదల చేసిన వీడియో ట్రైలర్ మాత్రమేనని..అసలు సినిమా ఇంకా ముందుందని వెల్లడించింది బీజేపీ.

ఇది ట్రైలర్ మాత్రమే.. కాంగ్రెస్‌పై అవినీతిపై బీజేపీ స్పెషల్ వీడియో!

ఈ వీడియోలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యూపీఏ హయాంలో ప్రధాన మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ కూడా ఉన్నట్లు సమాచారం. ప్రజల కష్టార్జితం రూ.4. 80 లక్షల కోట్లను కాంగ్రెస్ దోచుకుందని బీజేపీ వీడియోలో ఆరోపించింది. ఈ సొమ్ముతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చునని తెలిపింది. దేశ భద్రత నుంచి అభివృద్ధి వరకు అనేక పథకాలను పూర్తి చేయవచ్చునని పేర్కొంది.24 ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకలను, 300 రఫేల్ యుద్ధ విమానాలను కొనవచ్చునని, 1,000 మంగళ్ మిషన్స్‌‌ను నిర్వహించవచ్చునని వెల్లడించింది. కాంగ్రెస్ అవినీతి వల్ల పడిన భారాన్ని దేశం మోయవలసి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ వల్లే అభివృద్ధిలో దేశం వెనుకబడిందని పేర్కొంది. రూ.1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం గురించి కూడా దీనిలో చూపించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news