ప్లేబాయ్‌ మేగజైన్‌ కవర్‌పేజీపై ఫ్రాన్స్‌ మంత్రి పోజు.. సర్వత్రా విమర్శలు’

-

అమెరికాకు చెందిన ఎంటర్‌టైన్మెంట్ మేగజైన్ ప్లేబాయ్‌ కవర్‌పేజీపై ఫ్రాన్స్‌కు చెందిన మహిళా మంత్రి ఫొటో ప్రచురితమవడం వివాదాస్పదంగా మారింది. ఫ్రాన్స్‌ ప్రభుత్వంలో సోషల్‌ ఎకానమీ, అసోసియేషన్స్‌ శాఖ నిర్వహిస్తున్న మహిళా మంత్రి మార్లీనె షియప్పా ఇటీవల ప్లేబాయ్‌ పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ కోసం ఆ మేగజైన్ షియప్పా గ్లామర్ ఫొటో ప్రచురించింది. అయితే ఈ ఫొటో.. అందులో ఆమె వస్త్రధారణ తప్పుడు సంకేతాలను పంపిస్తోందని విమర్శకులు అంటున్నారు.

ఈ ఫొటోపై స్పందించిన ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిసాబెత్‌ బోర్నే.. మార్లీనెను పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో తాను చేసిన పని సరైంది కాదని మంత్రికి ప్రధాని చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాదాపు 12 పేజీల ఈ ఇంటర్వ్యూలో మహిళలు, ‘గే హక్కులు’, అబార్షన్లపై మార్లీనె మాట్లాడారు. ఈ విషయం ఫ్రాన్స్‌ ప్రభుత్వంలోని ప్రధాని, వామపక్ష సభ్యులకు నచ్చలేదు. ఈ సారి ఆమె తప్పు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.

మార్లీనె మాత్రం తాను చేసిన పని సరైందేనని ట్విటర్‌లో సమర్థించుకున్నారు. ‘’మహిళలకు వారి శరీరాలపై ఉన్న హక్కులను కాపాడుకోవాలి. వారు ఏమి కావాలనుకుంటే అది ఎక్కడైనా చేసేట్లు ఉండాలి. తిరోగమనవాదులు, ఆత్మవంచకులు ఎంత విసిగించినా.. ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉన్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news