వేసవి లో ఆల్కహాల్ తీసుకుంటే బ్రెయిన్ డ్యామేజ్.. ప్రాణాంతకం కూడా..!!

-

వేసవికాలంలో వచ్చే సమస్యలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వేసవి కాలంలో చాలా మంది రకరకాల సమస్యలకి గురవుతూ ఉంటారు. ఎండ వేడి వలన తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది మద్యం సేవిస్తూ ఉంటారు ఎండాకాలంలో మద్యం సేవించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకో తీసుకోవాలి…? మద్యం తీసుకోవచ్చా లేదా వంటి విషయాలను తెలుసుకుందాం.

 

వేడి వాతావరణం లో ఆల్కహాల్ తో కూడిన పానీయాలు నిజంగా ప్రమాదకరం. ఈ కాంబినేషన్ వలన చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవికాలంలో డిహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకుంటే డిహైడ్రేషన్ సమస్యను తప్పక ఎదుర్కోవాలి. వేసవిలో హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. కాదు అని వేసవిలో ఆల్కహాల్ తీసుకుంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వికారం నీరసం వంటివి ఆల్కహాల్ ని వేసవి కాలంలో తీసుకుంటే వస్తాయి. అలానే వడదెబ్బ కొట్టడం వంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలి.

వడదెబ్బ వలన స్పృహ ని కోల్పోడం, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. చనిపోయే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా వేసవికాలంలో హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. ఎక్కువసేపు ఎండలో తిరగకూడదు. ముఖ్యమైన పనులు అన్నిటిని ఉదయాన్నే చేసుకోవాలి. లేదంటే సాయంత్రం చల్లబడిన తర్వాత చేసుకోవాలి వేసవికాలంలో సన్ బర్న్స్ వంటివి కూడా తలెత్తే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ ని వేసవిలో తీసుకుంటే చర్మ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ కనుక ఏమైనా ఇబ్బందులు వేసవిలో ఎదుర్కొంటే కచ్చితంగా డాక్టర్ ని కన్సల్ చేయడం మంచిది.

ఆఖరుగా….

ఆల్కహాల్ చాలా ప్రమాదకరం ముఖ్యంగా వేడి వాతావరణంలో ఆల్కహాల్ చాలా ఇబ్బందుల్ని తీసుకు వస్తుంది ఆల్కహాల్ ని వేడి వాతావరణం తీసుకోవడం వలన రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మందు తాగే అలవాటు వున్న వాళ్ళు ఆల్కహాల్ ని తీసుకోకపోవడం మంచిది. హైడ్రేట్ గా ఉండాలంటే నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు వంటివి తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news