నాదెండ్ల మనోహర్‌పై పవన్‌ ప్రశంసలు

-

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. పార్టీ వ్యవహారాల్లో తనకు తలలో నాలుకలా వ్యవహరిస్తున్న నాదెండ్లకు జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన నేత నాదెండ్ మనోహర్ అని కొనియాడారు. సహనం, సౌశీల్యం కలిగిన నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్పీకర్ గా సభను నడిపిన విధానాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని పవన్ పేర్కొన్నారు.

Nadendla Shuts Mouths On Quitting JSP! | cinejosh.com

జనసేన పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా నాదెండ్ల ఎంతో నేర్పుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. పార్టీలోని క్షేత్రస్థాయి జనసైనికులు, వీర మహిళల నుంచి నేతల వరకు అందరినీ సమన్వయం చేస్తూ, ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన అనుభవం ఎంతో దోహదపడుతోందని తెలిపారు. నాదెండ్ల మనోహర్ కు సుఖసంతోషాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news