మన వంట గదిలో ఉండే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది..వీటిని తినడం ద్వారా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. ముఖ్యంగా మహిళలు గర్భాధారణ సమయంలో ఖర్జూరం తినడం చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో రెండు ఖర్జూరాలను తినడం తల్లికే కాదు, పెరుగుతున్న బిడ్డకు కూడా మంచిది. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణం. మరియు ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఖర్జూరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, సోడియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు, ప్రోటీన్, విటమిన్ D, ఇనుము, పొటాషియం ఉంటాయి. ఈ పోషకాలు గర్భిణీ స్త్రీలకు ఏవిధంగా సహాయపడుతాయి. ఖర్జూరాలు స్త్రీలకు ఎప్పుడు ఎంత మేలు చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం..
1. ఖర్జూరంలో పొటాషియం ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో రక్తపోటును స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే గర్భధారణ సమయంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతే కాకుండా, ఖర్జూరం గుండె, జీర్ణాశయం మరియు కండరాల సజావుగా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది.
2. ఖర్జూరంలోని ఫైబర్ జీర్ణ సమస్యలను నివారిస్తుంది. గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది మరియు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పీచు శరీర బరువును మెయింటైన్ చేస్తుంది..
3. ఖర్జూరంలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఫోలేట్ కొత్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది మరియు రక్తహీనతను నివారిస్తుంది. ఈ పోషకం పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు మరియు మెదడు దెబ్బతినకుండా కూడా నివారిస్తుంది..
4. ఖర్జూరంలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే, గర్భధారణ సమయంలో విటమిన్ కె అవసరం. ఎందుకంటే ఇది పిల్లల ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది…
5. గర్భధారణ సమయంలో ప్రసవ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖర్జూరం తినడం వల్ల ప్రసవ నొప్పి తగ్గుతుంది. ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని హెల్త్‌లైన్ నివేదికలు చెబుతున్నాయి. దీని కారణంగా గర్భాశయంలో ఫ్లెక్సిబిలిటీ మరియు విస్తరణ ఉంటుంది మరియు ప్రసవ సమయంలో తక్కువ నొప్పిని ఎదుర్కొంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో రోజూ 6 ఖర్జూరాలు తినే స్త్రీలకు ప్రసవ నొప్పి తగ్గుతుందని పరిశోధనలో తేలింది.
ఇక గర్భిణీలు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల కలిగే ఎటువంటి ప్రయోజనాలున్నాయో చూద్దాం…
* . ఖర్జూరంలోని క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం తదితర పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి.
*. ఖర్జూరం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర కణాలను వ్యాధుల నుండి రక్షిస్తుంది..
*.ఈ ఖార్జురాలను తినడం వల్ల మెదడుకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే, ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వాపును తగ్గించడం ద్వారా మెదడు కణాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది..