IPL 2023 : RCB ప్లేయర్ ను బండ బూతులు తిట్టిన సిరాజ్

-

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో బెంగ‌ళూరు 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

RRతో ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో ఆర్సిబి పేసర్ సిరాజ్ సహనం కోల్పోయాడు. 19వ ఓవర్ చివరి బంతికి RR బ్యాటరీ సెకండ్ రన్ కోసం పరిగెత్తాడు. ఫీల్డర్ లొమ్రార్ బంతిని విసరగా అప్పటికే సిరాజ్ కాలితో బెయిల్స్ పడగొట్టాడు. స్టంప్ మొత్తం తొలగిస్తే అవుట్ అయ్యేవాడు. కానీ అలా జరగలేదు. దీంతో సిరాజ్ ఆగ్రహంతో ఊగిపోతూ బూతులు తిట్టాడు. మ్యాచ్ అనంతరం లోమ్రార్ కు క్షమాపణలు చెప్పినట్లు సిరాజ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news