టార్గెట్ 90: రేవంత్ కల నెరవేరుతుందా.!

-

వరుసగా రెండుసార్లు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు తెలంగాణ సాధించిన పార్టీగా బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే బి‌ఆర్‌ఎస్ పార్టీని రెండుసార్లు చూశారు కదా..ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ని ఆదరించాలని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ప్రజలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని అంటున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అంటున్నారు గాని..అందుకు తగ్గట్టుగా  ఆపార్టీ పనితీరు లేదు..అంతర్గతంగా చాలా విభేదాలు ఉన్నాయి. పైగా కాంగ్రెస్ లో ఉన్న విభేదాలు వల్ల ఆ పార్ట్ బలహీనపడుతుంది. దీని వల్ల బి‌జే‌పి బలపడుతుంది. ఇలాంటి పరిస్తితుల్లో రేవంత్ మళ్ళీ పార్టీ కోసం పోరాటం మొదలుపెట్టారు. ప్రజల మద్ధతు కూడబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులని ఆకట్టుకునే విధంగా నిరుద్యోగ నిరసన సభలకు ప్లాన్ చేశారు. తాజాగా ఆయన ఖమ్మంలో సభ పెట్టారు. ఈ సభా వేదికగా ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలిపించాలని కోరారు.

 Revanthreddy

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పదికి పది నియోజకవర్గాల్లో గెలిపిస్తే.. రాష్ట్రంలో 90 సీట్లు తాము తీసుకువస్తామని రేవంత్ అన్నారు. అంటే 119 స్థానాలకు 90 స్థానాల్లో గెలవాలని రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే ఇది జరిగే పని కాదని…తెలంగాణలో రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.

ఎందుకంటే తెలంగాణలో అటు బి‌ఆర్‌ఎస్, ఇటు బి‌జే‌పిలు బలంగానే ఉన్నాయి..ఆ రెండు పార్టీలతో పోటీ పడి అధికారం దక్కించుకోవడమే కాంగ్రెస్ పార్టీకి కష్టం..అలాంటిది ఏకంగా 90 సీట్లు గెలవడం అనేది ఒక కల లాంటిది. ఆ కల నెరవేరాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడున్న పరిస్తితుల్లో అది సాధ్యం కాదు. ముందు అధికారానికి కావల్సిన 60 సీట్ల కోసం కష్టపడితే చాలు. చూడాలి మరి తెలంగాణలో నెక్స్ట్ కాంగ్రెస్ పరిస్తితి ఏంటి అనేది.

Read more RELATED
Recommended to you

Latest news