ఫ్యాక్ట్ చెక్: పెట్రోల్ ని పూర్తిగా నింపద్దని ఇండియన్ ఆయిల్ నోటీస్..?

-

సోషల్ మీడియాలో మనకి నకిలీ వార్తలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాహనదారుల వాహనాల ట్యాంక్ ని ఫుల్ చేయడం లేదు కేవలం మాక్సిమం లిమిట్ వరకే ఆయిల్ ని ఫిల్ చేస్తుందని..

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అందుకని వాహనదారులకి ఆయిల్ ని ఫుల్లుగా నింపడం లేదు అని ఓ వార్త వచ్చింది. మరి ఇంతకీ ఇది నిజమా కాదా..? ఇండియన్ ఆయిల్ ఈ మేరకు నోటీస్ తీసుకువచ్చిందా అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇండియన్ ఆయిల్ ఇటువంటి నోటీసుని తీసుకురాలేదు.

వాహనదారులు అనవసరంగా దీనిని అమ్మి మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆయిల్ ని మాక్సిమం లిమిట్ వరకే నింపుతారని.. ఆ తర్వాత నింపరని వస్తున్న వార్త వట్టి నకిలీ వార్త మాత్రమే సోషల్ మీడియాలో ఈ మధ్య నకిలీ వార్తలు ఎన్నో వస్తున్నాయి ఇటువంటి పుకార్లని నమ్మి మోసపోకూడదు ఇలాంటి నకిలీ వార్తలని ఇతరులతో కూడా షేర్ చేసుకోకండి.

Read more RELATED
Recommended to you

Latest news