పుష్ప-2 టీమ్​కు షాక్.. నక్సలైట్ల భయంతో ఒడిశాకు షూట్ షిఫ్ట్

-

ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​ నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా తీస్తున్నారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే..?

పుష్ప-2 సినిమా షూటింగ్​లోని కొంత భాగాన్ని ఛత్తీస్​గఢ్​లోని అడవుల్లో చిత్రీకరణ చేసేందుకు షెడ్యూల్​ ఖరారైంది. అక్కడ నక్సలైట్ల భయం ఉండటం వల్ల ఆ షూటింగ్​ లోకేషన్​​ను పక్క రాష్ట్రమైన ఒడిశాలోని అడవుల్లో ప్లాన్​ చేశారట మూవీ మేకర్స్.

ముందుగా ఛత్తీస్​గడ్​లోని సుక్మా అడవుల్లో సినిమా షూటింగ్​ షెడ్యూల్​ను నిర్ణయించింది పుష్ప-2 చిత్ర బృందం. కానీ అక్కడ నక్సలైట్లు బెడద కారణంగా ముందుజాగ్రత్తగా ఆ నిర్ణయాన్ని నిర్మాతలు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. సురక్షితమైన అడవి ప్రాంతంలో చిత్రీకరణ చేసేందుకు మంచి లొకేషన్​ స్పాట్​ను వెతుకుతున్న క్రమంలో ఒడిశాలోని మల్కన్‌గిరి అడవులు నచ్చడం వల్ల సినిమా షూటింగ్​ స్థలాన్ని అక్కడకు మార్చారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఈ అడవుల్లో సినిమా షూటింగ్​ ప్రశాంతంగా సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news