మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో వచ్చేవారం భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జూపల్లిని బిఆర్ఎస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉండడంతో ఆయన బిజెపిలో కంటే కాంగ్రెస్ చేరడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. జూన్ 8న రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయన ఎప్పుడో పార్టీలో చేరాలని భావించినప్పటికీ తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల రాజకీయ ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఉంటుందని అనుకున్నట్లు సమాచారం.