జగనన్న ఇళ్ల కాలనీలపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందన్నారు. పులివెందుల నియోజకవర్గంలో 18,186 ఇళ్లు మంజూరు కాగా.. 3,289 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయని మండిపడ్డారు. కడప జిల్లాలో 96,368 ఇళ్లు మంజూరు కాగా.. 18,996 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. దళారీల జోక్యంతో లబ్ధిదారులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిట్ కాస్ట్ రూ.1.80 లక్షలు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు వ్యయం అవుతోందన్నారు.
లబ్ధిదారులు ఇంటి కోసం అధిక వడ్డీలకు డబ్బులు అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకు పోయినట్లు తెలిపారు. దళారులు ఇంటి నిర్మాణం చేపట్టాతామని లబ్ధిదారులకు నమ్మించి లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఇంటి నిర్మాణాలను మధ్యలోనే ఆపి వేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఇంటి విస్తీర్ణం చాల అసౌకర్యం ఉందని చెప్పారు ఇళ్లు పిచ్చుక గూళ్లు లాగ ఉన్నాయని చెప్పారు. సొమ్ము ఒకరిది సొకు మర్కోరిదని అన్నట్లు ఉందని తెలిపారు. ఇంటి నిర్మాణంకు ఇచ్చే యూనిట్ కాస్ట్ లో రాష్ట్ర ప్రభుత్వానిది రూ 30 వేలు ఉండగా కేంద్ర ప్రభుత్వానిది రూ 1.50 లక్షల అన్నారు. కాని పేరు మాత్రం జగనన్నది అన్నారు. ఇంటి నిర్మాణానికి యూనిట్ కాస్ట్ రూ 1.8 లక్షల నుంచి రూ 5 లక్షలు వరకు పెంచాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఇంటి విస్తీర్ణం 1 సెంటు నుంచి 3 సెంట్లకు పెంచాలని కోరారు. ఇళ్ళ నిర్మాణాలను ప్రభుత్వమే పూర్తి చేయాలని కోరారు. దళారుల చేతుల్లో లబ్ధిదారులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.