వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఐఏఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 20వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఏప్రిల్ 24న నిరుద్యోగ సమస్యలపై దీక్షకు సిద్ధమైన షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. పోలీసులపై దాడి చేశారంటూ 24న షర్మిలను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఆ తర్వాత ఏప్రిల్ 25వ తేదీన నాంపల్లి కోర్టు షర్మిల కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసులపై దాడి కేసులో బంజారాహిల్స్ పోలీసులు చార్జీ షీట్ దాఖలు చేశారు. దీనిని విచారణ చేపట్టిన పోలీసులు నేడు కోర్టులో చార్జి షీట్ దాఖలు చేయగా.. విచారణకు హాజరు కావాలని షర్మిలకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు.