గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేయడం తనకు ఇష్టం లేదని, కానీ అనివార్య పరిస్తితుల్లో బరిలో దిగానని, కానీ తనని ఓడించడానికి కక్ష కట్టారని, ఉన్న ఓట్ల కంటే అధికంగా పోలయ్యేలా చేసి తనని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేశారని చెప్పి పవన్ తాజాగా వారాహి యాత్రలో చెప్పారు. అదే సమయంలో ఈ సారి తన గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఆపలేరని పవన్ చెప్పుకొచ్చారు.
ఇక ప్రజలిస్తే సీఎం పదవి స్వీకరిస్తానని అన్నారు. అయితే పవన్ గత ఎన్నికల మాదిరిగా ఈ సారి రెండుచోట్ల పోటీ చేయరని తేలిపోయింది. ఈ సారి ఒక స్థానంలోనే ఆయన పోటీకి దిగనున్నారు. ఎందుకంటే ఎలాగో టిడిపితో పొత్తు ఉంటుంది..పొత్తు ఉన్నప్పుడు సీట్ల సర్దుబాటు జరగాలి..అలాంటప్పుడు రెండుచోట్ల పోటీ చేయడం జరిగే పని కాదు. అందుకే పవన్ ఒక చోటే పోటీ చేస్తారు.
కాకపోతే ఆయన ఎక్కడ పోటీ చేస్తారనేది పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే ఆయన పోటీ చేసే సీట్లపై రకరకాల కథనాలు వచ్చాయి. కానీ చివరికి ఆయన పోటీ చేసేది భీమవరంలోనే అందులో ఎలాంటి డౌట్ లేదని తెలుస్తుంది. ఓడిన చోటే గెలిచి తీరాలని పవన్ చూస్తున్నారు. ఇప్పటికే భీమవరంలో పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఇక పొత్తులో భాగంగా ఇక్కడ టిడిపి సైతం పవన్‌కు ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది.
ఇటీవల సర్వేల ప్రకారం పొత్తు లేకపోయినా పవన్ ఒంటరిగా పోటీ చేసిన గెలవడం ఖాయమని..అదే పొత్తు ఉంటే భారీ మెజారిటీతో గెలుస్తారని తెలుస్తుంది. గత ఎన్నికల్లో భీమవరంలో వైసీపీకి దాదాపు 70 వేల ఓట్లు పడ్డాయి..జనసేనకు 62 వేలు, టీడీపీకి 54 వేల ఓట్లు పడ్డాయి. అంటే పవన్ పై 8 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచింది. అదే సమయంలో టిడిపి, జనసేన ఓట్లు కలిపితే లక్షా 16 వేల ఓట్లు..అంటే వైసీపీ కంటే 46 వేల ఓట్లు ఎక్కువ..ఇది 2019 లెక్క..ఇప్పుడు వైసీపీకి ఇంకా నష్టం జరిగేలా ఉంది. ఈ సారి భీమవరంలో భారీ మెజారిటీతో గెలిచి పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని చెప్పవచ్చు